మొబైల్ చూడటం వలన మన శరీరానికి, మనసుకు చాలా రకాలుగా నష్టాలు ఉంటాయి అవి ఏంటివో ఇప్పుడు మనం పరిశీలిద్దాం...
1. కళ్ళ సమస్యలు
కళ్ళు నొప్పిగా ఉండటం అలానే కంటి చూపు తగ్గడం.
కళ్ళు మసకబారిపోవడం వంటి సమస్య వస్తుంది.
మొబైల్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల కళ్ళకు అలసట కూడా వస్తుంది.
2. నిద్ర సమస్యలు
రాత్రి పూట మొబైల్ చూడటం వలన నిద్ర సరిగ్గా రాదు.
నిద్రలేమి వల్ల ఉదయం అలసటగా ఉంటుంది ఏ పని చేయబుద్ది కాదు.
3. మెదడు మీద ప్రభావం
దృష్టి కేంద్రీకరణ తగ్గుతుంది.
చదువు మీద అలానే పని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది.
ఆందోళన మరియు టెన్షన్ పెరిగిపోతుంది.
4. శారీరక సమస్యలు
మొబైల్ అలానే చూడటం వలన మెడనొప్పి వస్తుంది.
కూర్చొని కూర్చొని వెన్నునొప్పి కూడా వస్తుంది.
ఎక్కువసేపు కూర్చోడం వలన బరువు కూడా పెరుగుతారు.
5. సంబంధాలపై ప్రభావం
బంధువులు మరియు ఫ్రెండ్స్ తో కూడా సరిగ్గా మాట్లాడలేము.
ఒంటరితనం కూడా పెరిగిపోతుంది.
6. అలవాటు
మొబైల్ లేకపోతే అసహనం కూడా వస్తుంది.
సమయం వృధా అవుతుంది. ఏ పని చేసుకోలేకపోతాము.
ఎలా తగ్గించుకోవాలి?
రోజుకి 2 నుండి 3 గంటలకే పరిమితం చేయండి అవసరం అయితే నే మొబైల్ చూడండి.
నిద్ర కు ఒక గంట ముందు నుండి అసలు మొబైల్ వాడకండి.
అవసరం లేని apps తీసివేయండి మీ మొబైల్ లో నుండి.
20- 20- 20 రూల్ ఫాలో అవ్వండి. అంటే 20 నిమిషాల తర్వాత కొంచెం సేపు దృష్టి మళ్లించండి.
బయటి activities అలవాటు చేసుకోండి(walking, sports అలాంటివి).
చివరిగా ఒకమాట
"మొబైల్ మన కోసం ఉండాలి అంతే కానీ మొబైల్ కోసం మనం ఉండకూడదు"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి