8, ఏప్రిల్ 2026, బుధవారం

షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా?

 మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. తినే ఆహార విషయంలో కానీ మన అలవాటు వల్ల అయితేనేమి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాము. వాటిలో ముఖ్యమైన వ్యాధి షుగర్. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

అసలు షుగర్ వ్యాధి అంటే ఏమిటి?

మన శరీరంలో చక్కెర(గ్లూకోజ్)ఎక్కువగా ఉన్నప్పుడు దానిని షుగర్ వ్యాధి అంటాము. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వలన వస్తుంది.

మరి షుగర్ వ్యాధి లక్షణాలు తెలుసుకుందాము

1. తరచూ మూత్రం రావడం.

2. ఎక్కువగా దాహం వేయడం.

3. ఆకలి ఎక్కువగా వేయడము.

4. బరువు తగ్గడం.

5. అలసటగా అనిపించడం.

6. గాయాలు అయితే త్వరగా మానకపోవడం.

షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి?

1. మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉండటం.

2. మనం తినే ఆహార విషయంలో నియంత్రణ లేకపోవడం.

3. శరీర బరువు ఎక్కువగా ఉండటం.

4. మన శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం.

మరి షుగర్ వ్యాధిని నియంత్రణ ఎలా చేయాలి?

1. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి.

2. తక్కువ చక్కెర మరియు తక్కువ కొవ్వు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

3. మనం తినే ఆహారం లో ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

4. డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి.

5. నిరంతరం షుగర్ వ్యాధి చెకప్ చేయించుకుంటూ ఉండాలి.

మరి అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

1. పాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి.

2. మన జీవితంలో ఒత్తిడి సహజం కానీ ఆ ఒత్తిడి ను నియంత్రణలో ఉంచుకోవాలి.

3. ధూమపానం మరియు మద్యపానం కి దూరంగా ఉండండి.

సరైన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆరోగ్య కరమైన జీవితం ముఖ్యం మనకు.

ఈ పోస్ట్ నచ్చితే fallow చేయండి. మీ ఫ్రెండ్స్ కి share చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా?

 మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. తినే ఆహార విషయంలో కానీ మన అలవాటు వల్ల అయితేనేమి చాలా రకాలుగా ఇబ్బంది పడ...